
జిల్లాలో 26.3 మిల్లీమీటర్ల వర్షం
జనగామ: జిల్లాలో గత నెల 31వ తేదీ నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షం పత్తి, వరి పంటలకు ఊపిరిపోసింది. మృగశిర కార్తె ప్రారంభమైన తర్వాత చినుకు జాడ లేకపోవడంతో పత్తి విత్తులు నేలలోనే మురికి పోగా, నారు, నాట్లు వేసిన మళ్లు పగుళ్లు పట్టే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైయింది. ఈ పరిస్థితుల్లో వరణుడి కరుణతో కొంత మేలు జరిగింది. జిల్లాలో మంగళవారం నాటికి 26.3 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకోగా, రైతులు విత్తనాల కొనుగోలుకు జనగామ బాట పట్టారు.
మండలాల వారీగా వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో)
మండలం వర్షపాతం
బచ్చన్నపేట 48.0
జనగామ 45.5
లింగాలఘణపురం 42.5
దేవరుప్పుల 42.3
కొడకండ్ల 35.0
పాలకుర్తి 25.5
తరిగొప్పుల 23.3
నర్మెట 23.3
జఫర్‌గఢ్ 21.3
స్టేషన్‌ఘన్‌పూర్ 19.5
రఘునాథపల్లి 14.3
చిల్పూరు 10.3