జనగామ: జనగామ జిల్లా రోడ్లు, భవనాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా స్వరూపారాణి మంగళవారం పదవీబాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఈఈ కలెక్టర్ రిజ్వాన్‌బాషాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
పశు సంరక్షణపై అవగాహన కల్పించాలి
జనగామ రూరల్: విద్యార్థులకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ పశు సంరక్షణ, పోషణపై అవగాహన కల్పించాలని గో సేవా విభాగం తెలంగాణ ప్రశిక్షణ ప్రముఖ్ డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో హిందూ సంస్థల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, మాధవరెడ్డి, ముక్క స్వామి, చిక్కుడు నగేష్, సత్యం, అంచూరి రమేష్, కృష్ణమూర్తి, రాంబాబు, భజరంగ్ దళ్ నగర కన్వీనర్ యామంకి రాఖేష్ తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసిన ప్రభుత్వం
చిల్పూరు: ప్రభుత్వం పెన్షనర్లపై మొండి వైఖరిని కొనసాగిస్తూ వారి మనోభావాలను దెబ్బతీశారని పెన్షనర్ల సాధన పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. మండలకేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెన్షనర్లకు 15 నెలలుగా రావాల్సిన బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కొందరు సంఘం నాయకులు ఒక తప్పుడు సమాచారాన్ని సీఎంకు చేరవేయడంతోనే ఇలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచించి పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: పెంబర్తి మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ పోస్టుకు సంబంధిత పీజీ సబ్జెక్టులో 55శాతం ఉత్తీర్ణత, బోధనలో అనుభవం, యూజీసీ నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హత గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటు ందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 4వ తేదీలోపు కళాశాలలో నేరుగా దరఖాస్తు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 70133 10928 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
లింగాలఘణపురం: జీవితాలను నాశనం చేసే మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. మానసిక, శారీరక ఆరోగ్యాలపై ఏ విధంగా ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ సీతారామరాజు, ప్రిన్సిపాల్ సునీత, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, జితేందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి