
డ్రెయినేజీల క్లీనింగ్ షురూ..
జనగామ: పట్టణంలోని డ్రెయినేజీల్లో నిండిన సిల్ట్, చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు ప్రక్రియను మున్సిపల్ అధికా రులు సోమవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తంగా తయారైన పారిశుద్ధ్య పనులపై ‘కంపు కంపు’ శీర్షికన ఈనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పురపాలిక అధికారులు స్పందించారు. కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అధికారి పులి శేఖర్ ఆధ్వర్యాన సాయినగర్, జ్యోతినగర్, 11, 22వ వార్డుల పరిధి హైదరాబాద్‌రోడ్డు ఏరియా, ఇతర ప్రాంతాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేశారు. శానిటేషన్ కార్మికులు, జేసీబీలతో నాలాలు, డ్రెయిన్లలో నిండిన మట్టి, చెత్తను తీసి డంపింగ్ యార్డుకు తరలించారు. డ్రెయినేజీల శుభ్రంతో కొంత మేరకు ఇబ్బందులు తప్పనున్నాయని, ఈ క్లీనింగ్ ప్రక్రియ నిరంతరం చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో సమస్యను అధికా రుల దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేసిన ‘సాక్షి’కి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

డ్రెయినేజీల క్లీనింగ్ షురూ..