జనగామ: రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌గా పదోన్నతి పొందిన రోహిత్‌సింగ్‌ను జనగామ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి గాదె శ్రీనివాస్, కోశాధికారి మర్యాల లక్ష్మణ్ సోమవారం శాలువాతో సత్కరించారు. అనంతరం ఏసీకి శుభాకాంక్షలు తెలిపారు.
సీసీ కెమెరాల అందజేత
జనగామ: జనగామ పట్టణంలో మరింత నిఘా పెంచేందుకు ది చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రూ.3.20 లక్షల విలువ చేసే సీసీ కెమెరాలతో పాటు మెటీరియల్ అందజేశారు. ఈ మేరకు సోమవారం చాంబర్ అధ్యక్షుడు పోకల లింగయ్య, కార్యవర్గ సభ్యులు.. సీసీ కెమెరాల ను ఏఎస్పీ చేతన్ నితిన్, సీఐ దామోదర్ రెడ్డికి అప్పగించారు.
అప్రమత్తంగా ఉండాలి
జనగామ రూరల్: డ్రగ్స్ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యాన సోమవారం పెంబర్తి ఉన్నత పాఠశాలలో ‘డీఏడబ్ల్యూఎన్, డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ ఫర్ ఏ డ్రగ్– ఫ్రీ ఇండియా స్కీం–2025’పై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌తో కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం డాక్టర్ జి.నాగరాణి శేఖర్, జితేంద్ర పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోవాలి
జనగామ రూరల్: జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ అవార్డుకు ఈనెల 13వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి మార్గదర్శకాలు, ఇతర వివరాలు పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
పనుల్లో వేగం పెంచండి
జనగామ: పట్టణ సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, ఏఈ మహిపాల్‌తో కలిసి ఆర్టీసీ బస్టాండు చౌరస్తా, హనుమకొండ రోడ్డులో ఏర్పాటు చేయనున్న సూర్య నమస్కారం స్టాచ్యూ పనులపై ఆరా తీశారు.
హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యం
రఘునాథపల్లి: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంఘటిత సమాజ నిర్మాణమే విశ్వహిందూ పరిషత్ లక్ష్యమని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహనకృష్ణ అన్నారు. సోమవారం వీహెచ్‌పీ జిల్లా సహాయ కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, పట్టణ ఉపాధ్యక్షులు తాడూరి సంతోష్‌రాజ్, కాసర్ల మహేందర్‌లతో కలిసి మండలకేంద్రంలోని ఆధ్యాత్మిక, ధార్మిక ప్రముఖులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో పడకంటి రవీందర్, ఎల్.కిషన్‌రావు, చింతకింది కృష్ణమూర్తి, సత్యనారాయణ, వల్లాల శివ, జంపయ్య, పోకల హరిప్రసాద్, అంబటి బాలరాజు, ఉప్పలయ్య, రోహిత్, ఉప్పలయ్య, మహేందర్ పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌కు సత్కారం