
వృత్తి నైపుణ్యం సాధించాలి
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు అప్పగించిన పనుల్లో రాణించాలంటే వృత్తిలో నైపుణ్యం సాధించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. యూనిట్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్యూటీ మీట్‌లో విభాగాల వారీగా రాణించిన కమిషనరేట్ పరిధి పోలీసులను జోనల్ స్థాయిలో నిర్వహించే మీట్‌కు ఎంపిక చేయనున్న ట్లు తెలిపారు. ఈఏడాది రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు వృత్తి నైపుణ్యం సాధించడం ద్వారా నేరస్తులను త్వరగా గుర్తించడంతో పాటు, ప్రజలకు సత్వరమే న్యాయం అందించగలమని చెప్పారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్, రాజమహేంద్రనాయక్ అదనపు డీసీపీ రవి, సురేశ్‌కుమార్, ప్రభాకర్‌రావు, బోనాల కిషన్‌తో పాటు, జోనల్‌కు చెందిన ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సీపీ సన్ ప్రీత్ సింగ్