దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
జనగామ రూరల్: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే బీజేపీ లక్ష్యమని శాసన మండలి సభ్యుడు చిన్నమలై అంజిరెడ్డి అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనను పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యశాలలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వ అభివృద్ధి ఫలాలను ప్రజల్లో ప్రచారం చేయాల ని కార్యకర్తలు, నాయకులను కోరారు. తెలంగా ణలో రహదారుల నిర్మాణానికి రూ.100 కోట్లు కేంద్రం వెచ్చించిందని, 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ సర్కా రు కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నందరెడ్డి, ఆరుట్ల దశమంత్ రెడ్డి, కేవీఎల్‌ఎన్. రెడ్డి, లేగ రామ్మోహన్‌రెడ్డి, ఉడుగుల రమేశ్, శోభనబోయిన శివరాజ్ పాల్గొన్నారు.
శాసన మండలి సభ్యుడు చిన్నమలై అంజిరెడ్డి


