డల్లాస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: అమెరికా డల్లాస్‌లో నేడు(ఆది వారం) నిర్వహించే సభ చరిత్రలో నిలిచి పోతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని డల్లాస్‌లో నిర్వహించే సభ ఏర్పాట్లను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులకు ఫోన్ ద్వారా సందేశం పంపించారు. కేసీఆర్ ముందు చూపు, ఆలోచన విధానానికి ప్రస్తుత రాజకీయాల్లో ఆయనకు సాటి ఎవరూ లేరన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటి సారి నిర్వహించిన కరీంనగర్ శంఖారావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు సృష్టించిందని చెప్పారు. ఇటీవలి ఎల్కతుర్తి సభకు లక్షలాదిగా జనం వచ్చి విజయవంతం చేశారని, ఆ సభ తర్వాత ప్రజలకు కేసీఆర్, బీఆర్‌ఎస్‌పై నమ్మకం మరింత పెరిగిందన్నారు. ఎల్కతుర్తి సభ సక్సెస్‌ను స్వాగతిస్తూ డల్లాస్ సభకు ప్లాన్ చేసినట్లు వివరించారు. ఈ సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారని, అన్ని వర్గాల వారు పాల్గొని విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు.


