
ప్రతీఒక్కరు భక్తిభావాన్ని కలిగి ఉండాలి
పాలకుర్తి: ప్రతీఒక్కరు భక్తిభావాన్ని కలిగిఉండాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ముది రాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్ అన్నారు. మండలంలోని వల్మిడి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించగా.. మాజీ మంత్రి దయాకర్‌రావుతో కలిసి బండా ప్రకాశ్ సోమవారం ద ర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రకాశ్ మా ట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, ముదిరాజ్ మహాసభ నాయకులు నీరటి చంద్రయ్య, మాచర్ల ఎల్లయ్య, ఉత్సవ కమిటీ మోకాటి కొమురయ్య, వంగ సైదులు, నీరటి సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి కృషి
పాలకుర్తి టౌన్: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మామి డాల యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వ రాయితీపై అందించిన జీలుగ విత్తనాలను ఎమ్మెల్యే.. రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కిందన్నా రు. ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పెంచుకునేందుకు జీలుగ విత్తనాలు దోహదపడతాయని తెలిపారు. రైతుల ఆర్ధికంగా నష్టపోకూడదని జీలుగ విత్తనాలు రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ పాలకుర్తి సబ్ డివిజన్ ఉపసంచాలకులు అజ్మీరా పరుశరామ్‌నాయక్, మండల వ్యవసాయ అధికారి శరత్‌చంద్ర, నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, యాకాంతరావు, నాగన్న, సలీం, రైతులు పాల్గొన్నారు.
రక్తహీనత లేని సమాజాన్ని నిర్మిద్దాం
జనగామ: రక్తహీనత లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు పిలుపునిచ్చా రు. జిల్లా కార్యాలయంలో ఫార్మసీ ఆఫీసర్స్‌తో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో 50 నుంచి 60 శాతం మేర మహిళలు, చిన్న పిల్లలు రక్త హీనతతో బాధపడుతున్నారన్నారు. మహిళలకు ఐరన్ ఫొలిక్ మాత్రలు, పిల్లలకు ఐరన్ సిరప్‌లను అందించేందుకు జిల్లాకు ఇండెంట్‌తోపాటు సరఫరా చేసే విధానంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. రక్తహీనతకు సంబంధించి మాత్రలు, సిరప్‌ల కొరత లేకుండా ఫార్మసీ ఆఫీసర్స్ అలర్ట్‌గా ఉండాలన్నారు. పీహెచ్‌సీల వారీగా నిల్వ ఉన్న మందుల సమాచారం ఫిజికల్, ఆన్‌లైన్‌లో సరిగ్గా ఉండే విధంగా చూసువాలన్నారు. జిల్లా ఫార్మసీ ఆఫీసర్ రాజేందర్ తదితరులు ఉన్నారు.
ప్రొటోకాల్ పాటించకుంటే చర్యలు తప్పవు
జనగామ: కాంగ్రెస్ పార్టీలో ప్రొటోకాల్ పాటించకుంటే ఎంతటి వారైనా చర్యలు తప్పవని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో జనగామ, చేర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు గౌడ్, మల్లేష్‌తో కలిసి మాట్లాడారు. జనగామలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి, ప్రతి ఒక్కరూ పార్టీ ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సూచన మేరకు పార్టీ కా ర్యక్రమాలు చేపట్టాలన్నారు. నాగపురి కిరణ్ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడన్నారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల మంజూరులో కమీషన్లకు తెరలేపుతున్నాడని ఆరోపించారు. కిరణ్‌పై టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో నాయకులు గంగం నరసింహారెడ్డి, ఆలేటి సిద్ధిరాములు, బక్క శ్రీని వాస్, లక్ష్మీనారాయణ, యాదగిరిగౌడ్, సాయిలు, బన్సీ నాయక్, అనిల్ పాల్గొన్నారు.

ప్రతీఒక్కరు భక్తిభావాన్ని కలిగి ఉండాలి

ప్రతీఒక్కరు భక్తిభావాన్ని కలిగి ఉండాలి

ప్రతీఒక్కరు భక్తిభావాన్ని కలిగి ఉండాలి