
షాపు నుంచి గెంటేశాడు..
జనగామ బస్టాండ్‌లోని స్టాల్ నంబర్ 03లో జగదాంబ పాప్‌కార్న్ షాపునకు జనగా మకు చెందిన గుగులోత్ వెంకట్‌తో కలిసి టెండర్ వేయగా వెంకట్ పేరున టెండర్ వచ్చింది. ఆయనతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాను. షాపు అద్దె రూ.50 వేలు కూడా చెల్లించాను. అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరంపాటు భాగస్వాములుగా ఉండాల్సి ఉండగా రెండు నెలల తర్వాత షాపు నుంచి గెంటేశాడు. పోలీస్ స్టేషన్‌లో సంప్రదిస్తే కానిస్టేబుళ్లను పంపించి నన్నే షాపు నుంచి బయటికి పంపించేశారు. అట్రాసిటీ కేసు పెడుతామని బెదిరిస్తున్నారు. న్యాయం చేయాలి.
– నామాల రాజు, వడ్లకొండ