
ప్రజా ఉద్యమాలే ఊపిరిగా పోరాటం..
● సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి
జఫర్‌గఢ్: ప్రజా ఉద్యమాలే ఊపిరిగా సీపీఐ పోరాటాన్ని సాగిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో సీపీఐ మహాసభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం పోరాటాలు సాగిస్తున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాల సబ్సిడీతో పాటు పంట పొలాలకు సాగునీరు అందించే విషయంలో సాగించిన పోరాటం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్‌లో కూడా ఇదే తరహాలో పోరాటాలను సాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి జువారి రమేష్, నాయకులు ఎండీ యాకుబ్‌పాష, పెండ్యాల సమ్మయ్య, కూరపాటి చంద్రమౌళి, మంద బుచ్చయ్య, బుల్లె దూడయ్య, ఎండీ జాఫర్, గట్టుమల్లు, అన్నెపు అజయ్, నరహరి, రడపాక సత్యం, సాయిలు, యాదగిరి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.