
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
జనగామ రూరల్: జీపీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహులు అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కారోబార్లు, బిల్ కలెక్టర్లను పంచాయతీ అసిస్టెంట్లుగా నియమించాలని, జీఓ 51ని ఎత్తివేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలన్నారు. ఈ డిమాండ్లను సాధించుకునేందుకు ఈ నెల 25న రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో పని చేస్తున్న అన్ని సంఘాల బాధ్యులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చొల్లేటి శ్రీనివాసాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, కంజర్ల భాస్కర్, కోశాధికారి పిల్లి రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీధర్ యాదవ్, సహాయ కార్యదర్శి తిరుపతి, నాయకులు బాలనర్సయ్య, పాషా, మురళి, ప్రభాకర్, బాబుగౌడ్, శ్రీనివాస్, సురేశ్, గూడూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులు