
సీఎంను కలిసిన ఎమ్మెల్యే కడియం
స్టేషన్‌ఘన్‌పూర్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌డ్డిని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధిపై సీఎంతో చర్చించారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్ప న, కార్యాలయాల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు సంబంధించి రూ.87 కోట్లతో ప్రతిపాదనలను అందించారు. అలాగే మున్సిపాలిటీలో తాగునీటి అవసరాలకు సంబంధించి రూ.20 కోట్లతో ప్రతిపాదనలు అందించారు. ఆయా ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించారని, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులున్నారు.
ఘన్‌పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.87 కోట్లు, తాగునీటి వసతికి రూ.20 కోట్ల ప్రతిపాదనలు