
మైనార్టీ గురుకులంలో నాణ్యమైన విద్య
జనగామ: తెలంగాణ ప్రభుత్వం నిరుపేద మైనార్టీ విద్యార్థులకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్ల ప్రవేశానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మైనార్టీ గురుకులాల్లో 100 శాతం ఫలితాలు సాధించడం సంతోషకరమన్నారు. జిల్లాలోని మైనార్టీ విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం గురుకులంలో అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విక్రమ్‌కుమార్, పాఠశాల, కళాశాల ప్రిన్సిపాళ్లు కె.కుమారస్వామి, అనిల్ బాబు, మాధవీలత పాల్గొన్నారు.
పట్టణ సుందరీకరణ పనులను
పర్యవేక్షించిన కలెక్టర్
జనగామ: హనుమకొండ బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద జనగామకు వెల్‌కం చెబుతూ స్వాగత తోరణం నిర్మిస్తున్నారు. శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం స్వాగత తోరణం పనులతో పాటు హైదరాబాడ్ రోడ్డు, పెంబర్తి బైపాస్ జంక్షన్ అభివృద్ధి, బతుకమ్మకుంట సుందరీకరణ పనులను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ మహిపాల్‌తో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి మరింత కృషి
జనగామ రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి మరింత కృషి చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నేషనల్ ట్రస్ట్ చట్టం–1999 ప్రకారం, దివ్యాంగుల కోసం లీగల్ గార్డియన్ షిప్ పొందడానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో లోకల్ లెవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార పత్రాలను సమగ్రంగా పరిశీలించి నేషనల్ ట్రస్ట్ చట్టం విధానాల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్‌న్స్ దివ్యాంగుల సంఘం ప్రతినిధి బిట్ల గణేష్, మల్లికాంబ మనోవికాస కేంద్రం జనరల్ సెక్రటరీ రామలీల పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా