
‘సఖి’ సేవలపై అవగాహన కల్పించాలి
జనగామ: మహిళలకు సఖి సెంటర్ ద్వారా అందజేసే సేవలపై అవగాహన కల్పించాలని మహిళా కమిషన్ సభ్యురాలు జి.పద్మ అన్నా రు. జిల్లా కేంద్రం వడ్లకొండ ఇంటిగ్రేటెడ్ ప్రభు త్వ కార్యాలయాల సముదాయంలోని సఖి సెంటర్‌ను ఆమె బుధవారం సందర్శించారు. సెంటర్‌లోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం బాధితులకు అందించే సేవలపై ఆమె ఆరా తీశారు. మహిళా కమిషన్ వాట్సాప్ నంబర్–94905 55533, హెల్ప్‌లైన్ నంబర్–181ను సద్వినియోగం చేసుకునేలా విస్రృత ప్రచారం కల్పించాలని కోరారు. అనంతరం పద్మను సఖిసెంటర్ నిర్వాహకులు సత్కరించారు.
రేపటి నుంచి నెట్‌బాల్ పోటీలు
జనగామ: జిల్లా కేంద్రం బతుకమ్మకుంటలో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు స్టేట్ లెవల్ 8వ సబ్ జూనియర్ నెట్‌బాల్ చాంపియన్ షిప్–2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, సహాయ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమతుందని, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు రానున్నారని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
విధి నిర్వహణలో
అప్రమత్తంగా ఉండాలి
జనగామ: ఆర్టీసీ ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేరవేస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతూ సంస్థకు మంచి పేరు తేవాల ని స్థానిక డిపో మేనేజర్ ఎస్.స్వాతి అన్నారు. డిపోలో పరిధిలో ఏప్రిల్ నెలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రగతి రథ చక్రం అవార్డులతో పాటు ప్రశంసాపత్రాలను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
లైసెన్స్ సర్వేయర్ శిక్షణ●
జనగామ: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హులు దరఖాస్తు చేసుకో వాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలో 50 రోజుల పనిది నాలతో పాటు సర్వేపై ప్రత్యేక శిక్షణ ఉంటుంద ని చెప్పారు. ఇంటర్మీడియట్‌లో(గణిత శాస్త్రం ఒక అంశంగా) కనీసం 60 శాతం మార్కులతో పాటు ఐటీఐ డ్రాప్ట్స్‌మెన్ (సివిల్), డిప్లొమా(సివిల్), బీటెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన కోర్సులు చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ వరకు రూ.100 ఫీజుతో పాటు ఓసీ అభ్యర్థులు రూ.10వేలు, బీసీ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,500 మీ–సేవా కేంద్రంలో చెల్లించి అప్లై చేసుకోవాలన్నారు. లైసెన్స్ కలిగిన సర్వేయర్లుగా బాధ్యతలు చేపట్టేందుకు ఇది సువర్ణ అవకాశమని, జిల్లాలో ఇప్పటి వరకు 37 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.

‘సఖి’ సేవలపై అవగాహన కల్పించాలి