
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
స్టేషన్‌ఘన్‌పూర్: భూ భారతి రెవెన్యూ సదస్సులు ముగిసినందున అందులో వచ్చిన భూసమస్యల దరఖాస్తులను త్వరగా పరి ష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. స్థానిక తహసీల్దా ర్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు, తహసీల్దార్‌లతో సమీక్ష నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో 1,060 దరఖాస్తులు రాగా ప్రత్యేకంగా ఇప్పటి వరకు తహసీల్దార్ కార్యాలయానికి 300 వచ్చాయ ని చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే నేరుగా వచ్చి దరఖాస్తు సమర్పించాలని సూచించారు. సక్సేషన్ పెండింగ్ మ్యుటేషన్, మిస్సింగ్ నంబర్, భూసేకరణ, కోర్టు కేసులు, డిజిటల్ సంతకం వంటి మాడ్యూల్‌లోని సమస్యల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. అనంతరం స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీ లించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, హనుమాన్‌నాయక్ ఉన్నారు.