
కోర్టుకు హాజరైన జిల్లా ఉద్యమ నాయకులు
జనగామ రూరల్: జనగామ జిల్లా సాధన ఉద్యమకారులు శనివారం కోర్టుకు హాజరయ్యారు. పోరాడి జిల్లా సాధించుకున్నామే కాని అక్రమ కేసులు తొలగించలేదని నాయకులు అన్నారు. కోర్టుకు హాజరైన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఇనుగాల ప్రభాకర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వీరేందర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, చౌడ రమేశ్, ఆకుల సతీష్, దశమతరెడ్డి, ఉడుగుల రమేశ్, కేవీఎల్.రాజు, మేడ శ్రీనివాస్, బక్క శ్రీనివాస్, హరిశ్చంద్ర ప్రసాద్, మేకల రాంప్రసాద్, గుజ్జుల నారాయణ, జగదీష్, మంగళంపల్లి రాజు, మజిత్, ఎల్లయ్య, కృష్ణ ఉన్నారు.
ఐక్య పోరాటాలకు
సిద్ధం కావాలి
జనగామ రూరల్: మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ పిలుపునిచ్చారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు రాపర్తి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించి బ్రిటిష్ కాలం నాడు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేలా కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తోందని, ఇందుకు నిరసనగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరారు.అన్నబోయిన రాజు, చిట్యాల సోమన్న, బాలరాజు, మల్లేష్ రాజ్, ఐలయ్య రేణుక పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు రాలేదని అధికారుల నిలదీత
లింగాలఘణపురం: మండల పరిధి జీడికల్‌లో అర్హులైన తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదంటూ శనివారం జీడికల్‌లో ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్‌ను పలువు రు గ్రామస్తులు జీపీ కార్యాలయం వద్ద నిలదీశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాను చివరి దశలో విచారణ జరిపేందుకు శనివారం ఎంపీడీఓ జీడికల్ గ్రామానికి వెళ్లారు. పంచా యతీ కార్యాలయం వద్ద అప్పటికే కొంత మంది గుమికూడి జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయని తెలుసుకుని అర్హులైన తమకు ఇళ్లు ఎందు కు రాలేదని మండిపడ్డారు. తమకు ఖాళీ జాగా ఉందని, అధికారులొచ్చి చూశారని, ఫొటోలు దింపారని ఇప్పుడు మాత్రం తమ పేర్లు రాలేద ని, ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని మహేందర్, బాబు, శ్రీనివాసు, నగేశ్, నిర్మల తదితరులు ఎంపీడీఓను ప్రశ్నించారు. గ్రామంలో 91 మంది అర్హులున్నారని, మొదటి విడతగా 21 మందిని ఎంపిక చేశారని, మిగిలిన అర్హులకు రెండో విడతలో వస్తాయని సమాధానం చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులను దూషించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి ఏదైనా సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవాలని గొడవ చేయొద్దని చెప్పి వెళ్లారు. అప్పటికే గ్రామంలో మరో విచారణ ఉందని, ఎంపీడీఓ, కార్యదర్శి గ్రామ పంచా యతీ నుంచి వెళ్లిపోయారు.
నో రిజిస్ట్రేషన్లు
కాజీపేట అర్బన్ : కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం ఒక దస్తావేజు కూడా రిజిస్ట్రేషన్‌కు నోచుకోలేదు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో ట్రీ కటింగ్ చేసిన నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా లేదు. దీంతోపాటు ఇంటర్‌నెట్‌వైర్లు తెగిపోవడంతో సర్వర్ పని చేయలేదు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నారు. చివరికి రిజిస్ట్రేషన్లు లేక వెనుదిరిగారు. ఇదిలా ఉండగా.. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్లకు జాయింట్–1గా పదోన్నతి లభించింది. మల్టీజోన్‌లో భాగంగా ఆడిట్ విభాగం సబ్ రిజిస్ట్రార్ తిరుమల్, అడక్ ప్రమోషన్‌లో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆనంద్‌కు జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించింది.

కోర్టుకు హాజరైన జిల్లా ఉద్యమ నాయకులు