
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
దేవరుప్పుల/కొండకండ్ల/పాలకుర్తి: భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన ‘జై భీమ్, జై బాపు, జై సంవిధాన్’ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శుక్రవారం దేవరుప్పుల మండలం రామరాజుపల్లి, కొడకండ్ల మండలం రామవరం, పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేడ్కర్‌ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ సర్కారు మతం మసుగులో దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ గత పాలకుల తీరుపై అర్థరహిత విమర్శలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, కొడకండ్ల, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ల చైర్‌పర్సన్‌లు ఆండాలు, మంజులభాస్కర్, కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు నల్లా శ్రీరామ్, పులిగిళ్ల వెంకన్న, కృష్ణ, గణేష్, నాగరాజు, రసూల్, సత్యనారాయణ, సురేష్‌నాయక్, రాజేష్‌నాయక్, యాకేష్‌యాదవ్, రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, హర్వీశ్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి