● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్
జనగామ రూరల్: ప్రస్తుత సమాజంలో విద్యార్థుల కు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివి ల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. పట్టణంలోని బాలికల బాల సదనంను ఆయన గురువారం సందర్శించా రు. ఈ సందర్భంగా జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్స్ స్కీం–2024(ఎల్‌ఎస్‌యూసీ) చట్టంపై పిల్లలకు అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పిల్లలకు అండగా ఉటుందని, లెటర్ ద్వారా తమ సమస్యలు తెలియజేయాలని సూచించారు. వసతులు, భోజనం, టిఫిన్, స్నాక్స్ గురించి బాలికలను అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు ఆటల్లో రాణించాలని అన్నారు.