
దేవరుప్పుల: తలుపు తీసినా.. చేతిలో సంచి కనిపించినా.. ముప్పేట దాడిచేస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న వానరాలను ఎట్టకేలకు పట్టుకుని బోనులో బంధించారు. దీంతో దేవరుప్పుల బస్‌స్టేజీ కాలనీ వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నా రు. మండలంలో కోతుల సమస్య ప్రధానంగా మారింది. దీనిని నివారించడానికి ప్రభుత్వపరంగా తగిన అవకాశాలు లేకపోవడంతో మంత్రి దయాకర్‌రావు దాతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ఏల సోమసుందర్ స్పందించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, మున్‌పహాడ్ గ్రామాల్లో సుమారు 500 కోతుల ను పట్టించేందుకు శ్రీకారం చుట్టారు. రెండు రోజుల్లో సుమారు వంద కోతులను పట్టి బోనుల్లో బంధించారు. ఈ వానర సైన్యానికి సేనాధిపతిలా వ్యవహరించే మూడు నాలుగు లీడర్ కోతులు బందీకావడంతో మిగతావి కిమ్మనకుండా ఉండిపోయా యి. గురువారం మండల కేంద్రంలో బోనుల్లో బందీగా ఉన్న కోతులను చూసిన మిగితా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు తమ ప్రాంతాల్లో కార్యాచరణకు దిగుతున్నారు.

బోనులో బంధించిన కోతులను చూస్తున్న ప్రజాప్రతినిధులు