మహిళలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న అధికారులు
జనగామ: చిరుధాన్యాల ఉపయోగంపై మహిళా స్వయం సహాయ సంఘాలకు మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాలులో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా శిశు సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో పోషణ లోపం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈనెల 20నుంచి ఏప్రిల్ 3వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో మిల్లిట్స్ సామలు, కొర్రెలు, అరికెలు, జొన్నలు, సజ్జలు, రాగులు, కుసుమలు, అండు కొర్రలు, ఉదలు (చిరుధాన్యాలు) తదితర వాటిల్లో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయని చెప్పారు. ఇందులో ఎక్కువ శాతం విటమిన్స్ బీ12, బీ 17, బీ6 పీచు పదార్థాలు కలిగి ఉంటాయనే దానిపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని ఆహారంగా తీసుకునేలా పర్యవేక్షించే బాధ్యత స్వయం సహాయక సంఘాలపై ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ నూరొద్దీన్, ఏపీఎం జ్యోతి, ఐసీడీఎస్ సీడీపీఓ రమాదేవి, సూపర్‌వైజర్ పూర్ణిమ, కో ఆర్డినేటర్లు రాజశేఖర్, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.


