జనగామ రూరల్: దృష్టిలోపం ఉన్న వారికి మంగళవారం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సదరం క్యాంపు నిర్వహించినట్లు డీఆర్‌డీఓ రాంరెడ్డి తెలిపారు. హాజరైన 13మందికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజు, డాక్టర్లు మల్లారెడ్డి, కల్పన, అజయ్, ప్రాజెక్ట్ మేనేజర్ వినిత తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
జనగామ: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై వేటును నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలో సత్యాగ్రహ సంకల్ప దీక్ష చేపట్టారు. సత్యగ్రహ దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అదానీ కంపెనీల నిర్వహణపై జేపీసీ వేయాలని పార్లమెంటులో రాహుల్‌గాంధీ పట్టుబట్టడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు. దీంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణంతో పాటు ఆయా మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
చిల్పూరుగుట్ట హుండీ ఆదాయం రూ.9.88 లక్షలు
చిల్పూరు: మండలకేంద్రంలోని బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన హుండీలను మంగళవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించారు. రూ.9,88,767 ఆదాయంతో పాటు అమెరికన్ డాలర్ ఒకటి వచ్చింది. లెక్కింపు దేవాదాయ, ధర్మాదాయ నల్లగొండ జిల్లా ఇన్‌స్పెక్టర్ సుమతి, ఈఓ వెంకట్రావు, ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డీటీ కాసింనాయ క్, స్టేషన్‌ఘన్‌పూర్ పద్మశాలీ సేవాసమితి నాయకులు, చిల్పూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
నర్మెట: వచ్చే నెలలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు మండలంలోని పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాము అన్నారు. మంగళవా రం మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలో తాగునీటి వస తి, ఫర్నిచర్, సీసీ కెమెరాలు, వైద్య సదుపాయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సారయ్య, వాసు, దశరధ్, రామరాజు పాల్గొన్నారు.
ఏకశిల విద్యార్థుల ప్రతిభ
జనగామ: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సతీమణి లక్ష్మీబాయి స్మారకార్థం జాతీయస్థాయిలో ఇటీవల నిర్వహించిన సీఎల్‌బీ పోటీల్లో జనగామ పట్టణంలోని ఏకశిల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విజేతలు కె.అద్వైత్ (ప్రథమ స్థానం), ఎ.అర్చన (తృతీయ స్థానం), సీహెచ్ సోహాన్ (ఐదవ స్థానం), పి.లక్ష్మీప్రసన్న(8వ స్థానం), బి.మోహన్(10వ స్థానం)లో బహుమతులు గెలుచుకున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ సి.ఇందిర, సెక్రటరీ సి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. చుక్కా రామయ్య కుమారుడు శ్రీనివాస్ ప్రథమ బహుమతి రూ.2500, తృతీయ రూ.1000 నగదును అందించినట్లు చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.


