
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న యూనిఫామ్స్ ఇవే..
విద్యారణ్యపురి: గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించడంలో జాప్యం జరిగింది. ప్రభుత్వం సైతం విమర్శలు ఎదుర్కొంది. అయితే వచ్చే విద్యాసంవత్సరం(2023–24) కోసం ముందుగానే క్లాత్ పంపింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల ఎంఆర్సీలకు క్లాత్ చేరుకుంది. అక్కడ్నుంచి పాఠశాలల్లోని హెచ్‌ఎంలు తమ స్కూల్ పాయింట్ల కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లోకల్‌గా దర్జీలతో విద్యార్థులకు కొలతలు ఇప్పించి రెండు జతల స్కూల్ యూనిఫా మ్స్ కుట్టించాల్సి ఉంటుంది. ఈమేరకు హెచ్‌ఎంలు క్లాత్‌ను తీసుకెళ్లిన 15 రోజుల్లో యూనిఫామ్స్ కుట్టించి ఇవ్వాల్సిందిగా హెచ్‌ఎంలకు బాధ్యతలు అప్పగించారు.
జూన్‌లో అందజేత!
ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కేజీబీవీలు, టీఎస్‌ఆర్‌ఐఎస్‌ఈ మోడల్ స్కూల్స్, యూఆర్‌ఎస్‌లలో 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందజేస్తారు. ఆశ్రమ పాఠశాలల్లో మాత్రం ప్రాథమిక స్థాయి విద్యార్థుల వరకు స్కూల్ యూని ఫామ్స్‌ను అందజేస్తారు. ఈసారి విద్యా సంవత్స రం జూన్‌లో ప్రారంభం కాగానే.. విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
కుట్టు కూలి ఎప్పుడిస్తారో!
గత విద్యా సంవత్సరంలో టిస్కో క్లాత్‌ను పంపిణీ చేయగా.. మండలాల వారీగా ఏజెన్సీలకు అప్పగించి విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టిచి, స్కూల్ పాయింట్‌కు పంపిణీ చేశారు. అక్కడక్కడ కొలతలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల విద్యార్థులకు సరిగ్గా సరిపోలేదు. వదులుగా, టైట్‌గా ఉండడం వల్ల కొన్ని చోట్ల విమర్శలు వినిపించాయి. అయితే ఈసారి క్లాత్ ఎంఆర్సీ సెంటర్ల నుంచి స్కూల్ పాయింట్‌కు తీసుకెళ్లాక విద్యార్థులకు దర్జీలతో కొలతలు తీసుకొని కుట్టించాల్సి ఉంటుంది. జిల్లాలకు మాత్రం కుట్టు కూలీ చెల్లించేందుకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో కొన్నేళ్లుగా ఒక్కో జతకు రూ.50 మాత్రమే చెల్లిస్తున్నారు. రెండు జతలకు కలిపి రూ.100 ఇస్తున్నారు. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్‌లో కొద్దిగా మార్పులు చేశారు. పట్టీలు కూడా కుట్టాల్సి ఉంది. ఆకూలీకి దర్జీలు కుడతారా.. లేదా? అనేది వేచి చూడాలి.
కుట్టించే బాధ్యత హెచ్‌ఎంలదే..
దర్జీలకు ఒక్కో జతకు కూలి రూ.50
ఉమ్మడి జిల్లాలో
2,17,799 మంది విద్యార్థులు
స్కూళ్లు రీఓపెన్ కాగానే అందజేత
మోడల్ మారింది
విద్యార్థులకిచ్చే రెండు జతల స్కూల్ యూని ఫామ్స్‌లో కలర్, కుట్టించడంలో మార్పులు చేశారు. గత విద్యాసంవత్సరంలో ఇచ్చిన స్కూల్ యూనిఫామ్‌కు భిన్నంగా ఇవి ఉండనున్నాయి. గతంలో కంటే కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు ఒక రకంగా, 4 నుంచి ఐదో తరగతి వరకు మరో రకంగా 6 నుంచి 12 వరకు బాలికలకు ఇంకో రకంగా కుట్టించనున్నారు. స్కూల్ యూనిఫామ్ కలర్ ఒక్కటే అయినప్పటికీ స్టిచింగ్‌లో మార్పులు చేశారు. బాలురకు 1 నుంచి 7 వరకు ఒక రకంగా, 8 నుంచి 12వ తరగతి వరకు మరో రకంగా.. స్కూల్ యూనిఫామ్ ను కుట్టించబోతున్నారు.
జిల్లాల వారీగా విద్యార్థులు
జిల్లా విద్యార్థులు
హనుమకొండ 39,445
వరంగల్ 43,948
జనగామ 35,905
ములుగు 21,439
జయశంకర్ 22,874
మహబూబాబాద్ 54,188
మొత్తం 2,17,799