ఎస్సారెస్పీ నీరు విడుదల చేస్తున్నట్లు చెపుతున్నప్పటికీ కాలువ చివరి భూములకు నీరు రావడం లేదు. ప్రధాన కాలువే కాకుండా, చిన్న కాలువలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎక్కువ నీరు విడుదల చేస్తే కాలువ గట్లు దెబ్బతింటున్నాయి.
– ఏలేటి స్వామిరెడ్డి,
శ్రీరాములపల్లె, గొల్లపల్లి
ఏటా మరమ్మతు చేయాలి
ప్రతి ఏడాది కాకతీయ కాలువతో పాటు ఇతర కాలువలకు మరమ్మతు చేయాలి. గట్ల వెంబడి ఉన్న చెట్లను తొలగించాలి. కాలువలో ఉన్న మట్టిని తొలగించేందుకు ఉపాధి హామీని అనుసంధానం చేయాలి.
– వామన్‌రెడ్డి, అంతర్గాం, జగిత్యాల రూరల్


