ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల్లేవ్‌.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల్లేవ్‌..

Mar 30 2026 8:40 AM | Updated on Mar 30 2026 8:40 AM

సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026

జగిత్యాల: జిల్లాకేంద్రంలో ఉన్న జనరల్‌ ఆస్పత్రి జిల్లాలోనే పెద్దది. ఇక్కడ మెడికల్‌ కళాశాల కూడా ఏర్పడటంతో రోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. కానీ వారికి సరిపడా అత్యవసరమైన మందులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నా రు. ఈ పరిస్థితి కొన్ని రోజులుగా నెలకొన్నా.. అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఉన్నతాధికారులు స్పందించడం లేదు. ఫలితంగా రోగులు ప్రైవేటు మెడికల్‌ షాపుల్లోనే మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందాలనే ఉద్దేశంతో అనేక సదుపాయాలు కల్పించినా.. మందులు లేకపోవడం.. ప్రైవేటు షాపులను ఆశ్రయించాల్సి రావడంపై రోగులు పెదవి విరుస్తున్నారు.

నిత్యం వెయ్యి మందికి పైగానే..

జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగున్న ఉన్న నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని వివిధ గ్రామాల ప్రజలు ఈ జనరల్‌ ఆస్పత్రికి వస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ వెయ్యి మందికి ఓపీ ఉంటుంది. జ్వరం, ఇతరత్రా రోగాలతో బాధపడుతు న్న వారు చికిత్స చేయించుకుంటారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నమాటేగానీ.. వారికి కావాల్సిన మందులు లేకపోవడంతో వైద్యులు రాసిచ్చిన చీట్టీ తీసుకెళ్లి బయట ప్రైవేటు మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది పేదలు, మధ్యతరగతి వారిపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. చిన్నచిన్న మందులు కూడా ఆస్పత్రికి రావడం లేదని, ఇందుకు బడ్జెట్‌ లేకపోవడమే ప్రధాన కారణమని ఆస్పత్రివర్గాల వారే పేర్కొంటున్నారు.

కొరత ఉన్న మందులు

లాబెటలాల్‌, నెపెంటిన్‌, లివోప్రిన్‌, బివీవైకై న్‌, ఎనామిన్‌, మెపెంట్రినిన్‌ వంటి మందులతో పాటు, పారాసిటమాల్‌, ఇతరత్రా చిన్నచిన్న మందులు కూడా లేకపోవడంతో అత్యవసర సమయంలో రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఆస్ప త్రి సిబ్బందికి కావాల్సిన గ్లౌస్‌లు కూడా లేవని పేర్కొంటున్నారు. చిన్నచిన్న మందులతో పాటు, గ్లౌస్‌లు, సర్జికల్‌కు సంబంధించిన సామగ్రి వెంటనే తెప్పించేలా చూడాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌ చొరవ తీసుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి మందుల కొరత లేకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

అత్యవసర గోళీలు కూడా కరువే..

ఇబ్బంది పడుతున్న రోగులు

ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు

బడ్జెట్‌ లేకపోవడమేనంటున్న ఆస్పత్రి వర్గాలు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement