కానిస్టేబుల్‌ అవయవాలు దానం | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ అవయవాలు దానం

Mar 27 2026 9:15 AM | Updated on Mar 27 2026 9:15 AM

జగిత్యాలక్రైం: తాను మరణించినా మరో ఇద్దరి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో అవయవాలు దానం చేశారు కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులు. కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నల్లాల లక్ష్మీరాజం బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందాడు. దుఃఖంలో ఉన్నప్పటికీ ఆయన భార్య రాధ భర్త రెండు కిడ్నీలను దానం చేసి మానవత్వాన్ని చాటుకుంది.

బైక్‌ ఢీకొని వృద్ధురాలు మృతి

కోరుట్ల: పట్టణంలోని అల్లమయ్యగుట్ట సమీపంలో గుర్తు తెలియని ద్విచక్రవాహనం ఢీకొని అదే ప్రాంతానికి చెందిన కల్లెం లింగవ్వ(63) మృతి చెందినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. లింగవ్వ వేములవాడ రోడ్‌ దాటుతుండగా కోరుట్ల నుంచి అతి వేగంగా వచ్చిన బైక్‌ ఢీకొట్టి వెళ్లిపోయింది. లింగవ్వ తల, కాళ్లకు తీవ్ర గాయాలు కావటంతో కోరుట్ల, అక్కడి నుంచి జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది. లింగవ్వ కుమారుడు కల్లెం రాంచంద్రం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement