శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026
జగిత్యాల: జిల్లాలో ఇంధన నిలువలు ఉన్నాయని, ప్రజలు వదంతులు నమ్మవద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ప్రజలు ఒక్కసారిగా బంకుల్లోకి రావడంతో విక్రయాలు పెరిగాయని, తద్వారా తాత్కాలికంగా నోస్టాక్ బోర్డులు పెట్టారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ముందుగానే సరిపడా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యాసంగి కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు.
కలెక్టర్ సత్యప్రసాద్


