జగిత్యాల రేసులో నలుగురు | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల రేసులో నలుగురు

Feb 16 2026 7:23 AM | Updated on Feb 16 2026 7:23 AM

జగిత్

జగిత్యాల రేసులో నలుగురు

జగిత్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని బీసీ మహిళకు రిజర్వ్‌ చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో చైర్‌పర్సన్‌ రేస్‌లో ఎమ్మెల్యే సంజయ్‌ వర్గీయులు ఇద్దరు.. మాజీమంత్రి జీవన్‌రెడ్డి వర్గీయులు ఇద్దరు ఉన్నారు. ఎమ్మెల్యే వర్గంలో 24 మంది ఉండగా.. అతని ఎక్స్‌అఫీషియో ఓటుతో సంఖ్యాబలం 25కు చేరుకుంటుంది. అయినప్పటికీ ఇంకో సభ్యుడు తప్పనిసరి. జీవన్‌రెడ్డి వర్గంలో 17 మంది ఉన్నారు. కాంగ్రెస్‌కు సంబంధించిన వారికే చైర్‌పర్సన్‌ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌ 23 స్థానాలు గెలుచుకున్నా.. జీవన్‌రెడ్డి వర్గం, ఎమ్మెల్యే వర్గంగా చీలింది. అధిష్టానం జోక్యం చేసుకుని ఇద్దరిని కలిపితేనే చైర్‌పర్సన్‌ ఎన్నిక సులువు అయ్యే అవకాశం ఉంది. గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన అడువాల జ్యోతి.. ఇటీవల కాంగ్రెస్‌ మద్దతోనే చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తర్వాతి పరిణామాల్లో ఆమె అటు ఎమ్మెల్యేతో.. ఇటు జీవన్‌రెడ్డితో సఖ్యతగా ఉన్నారు. అప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి 30 మంది గెలువగా.. ఎమ్మెల్యే సమిండ్ల వాణిని సూచించారు. ఆ సమయంలో కాంగ్రెస్‌కు ఏడుగురే ఉన్నా.. జీవన్‌రెడ్డి అడువా ల జ్యోతికి మద్దతిచ్చి చైర్‌పర్సన్‌ చేశారు. తాజా గా ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడం.. అధిష్టానం ఆయనకే ప్రాధాన్యం ఇవ్వడంతో సునాయసంగా ఎన్నిక కావాల్సిన చైర్మన్‌ పదవికి ఇబ్బందులు తలెత్తాయి. మొదటి నుంచి కాంగ్రెస్‌ జెండా మోసిన కార్యకర్తలకే దక్కాలని, అందులోనూ అయితే ములస్థలం లావణ్య.. లేకుంటే తోపార పు లావణ్యకు ఇవ్వాలని జీవన్‌రెడ్డి పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే అయితే అడువాల జ్యోతి.. లే కుంటే సమిండ్ల వాణికి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఏదేమైనా అధిస్టానం నిర్ణయం మేరకు జరిగితే ఈ నలుగురిలో ఎవరికో చైర్‌పర్సన్‌ పదవీ దక్కే అవకాశం ఉంటుంది.

అడువాల జ్యోతి

సమిండ్ల వాణి

తోపారపు లావణ్య

ములస్థలం లావణ్య

వేముల నాగలక్ష్మి

జక్కు పద్మ

ధర్మపురి: ధర్మపురిలో 15వార్డులకుగాను కాంగ్రెస్‌ 15 వార్డులు గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. ధర్మపురి చైర్మన్‌ స్థానం జనరల్‌ మహిళ కావడంతో ఇద్దరు ఓసీలు, ఓ బీసీ మహిళ పీఠం కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఓసీల్లో జక్కు పద్మ, సంగనభట్ల సంతోషి పోటీ పడుతుండగా.. బీసీ నుంచి వేముల నాగలక్ష్మి పీఠాన్ని అడుగుతున్నారు. వీరిలో పీఠం ఎవరికి దక్కనుందో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

ధర్మపురిలో ముగ్గురి మధ్య..

జగిత్యాల  రేసులో నలుగురు
1
1/7

జగిత్యాల రేసులో నలుగురు

జగిత్యాల  రేసులో నలుగురు
2
2/7

జగిత్యాల రేసులో నలుగురు

జగిత్యాల  రేసులో నలుగురు
3
3/7

జగిత్యాల రేసులో నలుగురు

జగిత్యాల  రేసులో నలుగురు
4
4/7

జగిత్యాల రేసులో నలుగురు

జగిత్యాల  రేసులో నలుగురు
5
5/7

జగిత్యాల రేసులో నలుగురు

జగిత్యాల  రేసులో నలుగురు
6
6/7

జగిత్యాల రేసులో నలుగురు

జగిత్యాల  రేసులో నలుగురు
7
7/7

జగిత్యాల రేసులో నలుగురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement