మారుమోగిన శివనామస్మరణ | - | Sakshi
Sakshi News home page

మారుమోగిన శివనామస్మరణ

Feb 16 2026 7:23 AM | Updated on Feb 16 2026 7:23 AM

మారుమ

మారుమోగిన శివనామస్మరణ

దుబ్బ రాజేశ్వరస్వామి జాతరలో భక్తులు

పెగడపల్లి: రాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు క్యూలో ఉన్న భక్తులు

జగిత్యాలరూరల్‌/రాయికల్‌/కోరుట్ల/మల్లాపూర్‌/వెల్గటూర్‌:మహాశివరాత్రి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నారు. కోటిలింగాల కోటేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సారంగాపూర్‌ మండలం పెంబట్ల కోనాపూర్‌లోని శ్రీదుబ్బరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో జాగారణ చేశారు. ఆలయ ఈవో అనూష, ఫౌండర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పొరండ్ల శంకరయ్య, సర్పంచులు ఆకుల రమేశ్‌, కొలపాక రాధ పాల్గొన్నారు. మల్లాపూర్‌ మండల కేంద్రంలోని శ్రీకనకసోమేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. శివదీక్షలు విరమించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. రాయికల్‌లోని శివాలయం, చెన్నకేశవనాథ, కొత్తపేట రాజరాజేశ్వరస్వామి ఆలయం, అల్లీపూర్‌, ధర్మాజీపేట, కుమ్మరిపెల్లిలోని ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కొత్తపేటలో శివపార్వతుల కల్యాణానికి తహసీల్దార్‌ నాగార్జున దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

మారుమోగిన శివనామస్మరణ1
1/1

మారుమోగిన శివనామస్మరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement