జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యం
కళాశాల ఆవరణలో విశాలమైన ఆటస్థలం ఉండడంతోపాటు 200 ట్రాక్ అందుబాటులో నిత్యం పీఈటీ సూచనలతో ప్రాక్టీస్ చేస్తున్న. ఇప్పటివరకు3 కిలోమీటర్ల పరుగు పందెం, 1500మీటర్ల పరుగు పందెం పోటీల్లో ఆరుసార్లు రాష్ట్రస్థాయిలో పాల్గొన్న. జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో రాణించడమే లక్ష్యం.
– ఆర్.మనీష, ఇంటర్ ఫస్టియర్
నిత్యం ప్రాక్టీస్‌తో జాతీయస్థాయికి..
జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటేందుకు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్న. ఎస్‌జీఎఫ్–19 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాను. నిత్యం ప్రాక్టిస్ చేయడంతోపాటు, పిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక ప్రోత్సహిస్తుండడంతో ఆటల్లో రాణిస్తున్నాం.
– హారిక, ఇంటర్ సెకండియర్
ప్రత్యేక శిక్షణతో ప్రతిభకు పదును
విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం. విద్యార్థులకు నిత్యం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగాసానాల్లో ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ఆటలతో క్రమశిక్షణ, మానసికస్థైర్యం పెంపొందుతుంది. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ, వారి ప్రతిభకు పదును పెడుతున్నాం.
– మధులిక, పీఈటీ, తాటిపల్లి గురుకుల కళాశాల
జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యం
జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యం


