విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● అదనపు కలెక్టర్ బీఎస్.లత
సారంగాపూర్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మండలంలోని అర్పపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులతో ఉపాధ్యాయులు కలిసి భోజనం చేయాలని, దీని ద్వారా వారికి పౌష్టికాహారం అందుతుందా అనే విషయం తెలుస్తుందన్నారు. పాఠశాలకు రాని విద్యార్థిని పచునూరి అక్షిత ఇంటికి వెళ్లి ప్రతిరోజు బడికి పంపించాలన్నారు. అనంతరం కోనాపూర్, అర్పపల్లి, ధర్మనాయక్‌తండా, రంగపేట, నాగునూర్, లచ్చక్కపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ వాహిదొద్దీన్, ఉపాధ్యాయులు ఉన్నారు.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు సారంగాపూర్ విద్యార్థిని
సారంగాపూర్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని సీహెచ్.మైత్రీ ఎంపికై ంది. పదో తరగతి చదువుతున్న మైత్రీ ఈనెల 28 నుంచి 30 వరకు మెదక్ జిల్లా పటాన్‌చెరువులో జరిగే పోటీల్లో పాల్గొననుంది. మైత్రీ ఎంపికపై పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రవీందర్, ఉపాధ్యాయులు అభినందించారు.
సారంగాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేసిందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని పెంబట్లలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. ఇప్పుడు కేవలం 17 శాతానికి తగ్గించిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో రూ.200 కోట్లు ఖర్చు చేసి కుల గణన చేయడం డ్రామాగా పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు తేలు రాజు, విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, నాయకులు ఎండబెట్ల ప్రసాద్, కొండ ప్రభాకర్, భైరి మల్లేశం తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి


