కోటేశ్వరస్వామి సేవలో జిల్లా అడిషనల్ జడ్జి
వెల్గటూర్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా అడిషనల్ జడ్జి నారాయణ కోటిలింగాల కోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు న్యాయమూర్తితో పూజలు, అభిషేకాలు చేయించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శేషవస్త్రంతో సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ చైర్మన్ పూదరి రమేశ్, ఈవో కాంతారెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు.
పామర్రుకు ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ
మెట్‌పల్లి: మెట్‌పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పామర్రుకు ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించినట్లు డిపో మేనేజర్ దేవరాజ్ బుధవారం తెలిపారు. ఈ మార్గంలో నడిచే బస్సు సర్వీసును కొన్ని కారణాలతో నిలిపివేశామని, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు తిరిగి ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు మెట్‌పల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6గంటలకు అక్కడికి చేరుకుంటుందన్నారు. తిరిగి సాయంత్రం 5.45 గంటలకు అక్కడినుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9గంటలకు మెట్‌పల్లికి వస్తుందన్నారు. సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఆలయ భూముల రక్షణ అందరి బాధ్యత
జగిత్యాలటౌన్: ఆలయ భూములు, ఆస్తుల పరిరక్షణ ప్రతిపౌరుని బాధ్యత అని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ధరూర్ క్యాంపులోని శ్రీకోదండ రామాలయాన్ని దర్శించుకున్నారు. భక్తులు సేకరించిన విరాళాలతో తయారు చేయించిన వెండి కిరీటం, ధనస్సు, ఖడ్గం, సీతమ్మవారికి హారం సమర్పించారు. గతంలో కొందరు కోదండ రామాలయ భూముల ఆక్రమణకు యత్నించగా కులమతాలు, రాజకీయాలకు అతీతంగా స్పందించి కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. తాజామాజీ కౌన్సిలర్ ఒద్ది శ్రీలత, ఆలయ కమిటీ ప్రతినిధులు మాధవరెడ్డి, గౌరిశెట్టి హరీశ్, గండ మధుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కోటేశ్వరస్వామి సేవలో జిల్లా అడిషనల్ జడ్జి


