వరి కోతలు ఎలా..?
జగిత్యాలఅగ్రికల్చర్: వరి పంట బాగా పండిందని సంబరపడుతున్న రైతన్నకు పంటను కోయించడంలో తిప్పలు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో పొలాలు దిగబడుతున్నాయి. తేమ కారణంగా హార్వెస్టర్లతో కోయించలేకపోతున్నారు. చైన్‌మిషన్లతో కోయిస్తే ఖర్చు అధికమవుతోంది. జిల్లాలో 3.15లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం ఆ పంట కోతకు వచ్చింది. అధిక వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిలిచి హార్వెస్టర్లు దిగబడుతున్నాయి. వరోమైపు వరి పంట ఈదురుగాలులకు నేలవాలడంతో కోయించడం రైతులకు తలకు మించిన భారమవుతోంది.
పెరుగుతున్న ఖర్చులు
పొలం ఆరితే హార్వెస్టర్లు సులభంగా పంటను కో స్తాయి. ఇందుకు గంటకు రూ.రెండువేల వరకు తీసుకుంటారు. తేమ ఉన్న పొలంలో ఫోర్‌వైడ్ వీలర్ హార్వెస్టర్ కోస్తే గంటకు రూ.3వేల వరకు తీసుకుంటారు. ప్రస్తుతం హార్వెస్టర్లు దిగబడుతుండటంతో చైన్‌మిషన్లను ఆశ్రయించాల్సి దుస్థితి ఏర్పడింది. ఆ యంత్రాలు స్థానికంగా లేకపోవడంతో తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి దళారులు తీసుకొస్తున్నారు. డిమాండ్‌ను బట్టి గంటకు రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు.
కేంద్రాలకు తరలించడం కష్టమే
ఏదోలా పంటను కోయించినప్పటికీ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించడం రైతులకు కష్టంగా మారింది. హార్వెస్టర్‌తో కోయిస్తే ట్రాక్టర్ అక్కడివరకు వెళ్లి ధాన్యాన్ని ట్రాలీలో లోడ్ చేసుకుంటుంది. తేమ ఉన్న పొలంలో ట్రాక్టర్ కూడా దిగబడే పరి స్థితి ఉంది. చైన్‌మిషన్‌తో కోయించడం ద్వారా ధా న్యాన్ని ఒడ్డుకు చేర్చడం మరో ఎత్తుగా మారింది.


