లక్ష దీపోత్సవంలో భక్తులు
మల్లాపూర్: కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్లాపూర్‌లోని సోమేశ్వరస్వామి, వాల్గొండలోని రామలింగేశ్వర స్వామి ఆలయాలు బుధవారం కిక్కిరిసిపోయాయి. సోమేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులు బల్యపల్లి ప్రభాకర్‌శర్మ ఆధ్వర్యంలో భక్తులు లక్ష దీపోత్సవంలో పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వీడీసీ చైర్మన్ సంగ గంగరాజం, వైస్ చైర్మన్ ఇల్లెందుల తుక్కారాం పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో కమిటీ చైర్మన్ సాంబారి శంకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మీ అర్చకులు రాజశేఖర్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
నిర్వహించారు.
లక్ష దీపోత్సవంలో భక్తులు


