
ఆర్థిక నేరగాళ్ల ఆస్తులు జప్తు చేయాలి
జగిత్యాలటౌన్: క్రిప్టో కరెన్సీ మోసాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. అధిక లాభాలు, విదేశీ టూర్ల ఆశతో బిట్‌కాయిన్, మెటాఫండ్ వంటి యాప్‌ల ద్వారా ప్రజల నుంచి పెట్టుబడి పెట్టిస్తూ.. క్షణాల వ్యవధిలో ఆ యాప్‌లను తొలగిస్తూ మోసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండా సాగుతున్న ఆన్‌లైన్ ఆర్థిక కార్యకలాపాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లలో పెట్టుబడి అరికట్టేలా చూడాలని కోరారు. నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, మసర్తి రమేశ్, కల్లెపెల్లి దుర్గయ్య, మహ్మద్‌భారీ, మన్సూర్, చాంద్‌పాషా, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.