నీటిలో మునిగి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

నీటిలో మునిగి వ్యక్తి మృతి

Oct 14 2025 7:41 AM | Updated on Oct 14 2025 7:41 AM

నీటిల

నీటిలో మునిగి వ్యక్తి మృతి

నీటిలో మునిగి వ్యక్తి మృతి రోడ్డు ప్రమాదంలో యువకుడి... రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మానేరువాగులో స్నానం చేసి బయటకు వస్తుండగా ఫిట్స్‌ వచ్చి నీటిలోనే వ్యక్తి చనిపోయిన సంఘటన పొత్తూరులో విషాదం నింపింది. మండలంలోని పొ త్తూరుకు చెందిన బండారి వెంకటయ్య(48) కొంతకాలంగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం హమాలీ పనులు ముగించుకున్న తర్వాత గ్రామ పొలిమేరలోని మానేరువాగులో స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తుండగానే వెంకటయ్యకు ఫిట్స్‌ వచ్చి నీటిలోనే పడి మృతిచెందాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మానేరువాగు వైపునకు వెళ్లిన గ్రామస్తులు వెంకటయ్య మృతదేహం చూసి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్సై జి.లక్పతి తెలిపారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు.

ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం

కోరుట్ల రూరల్‌: మండలంలోని వెంకటాపూర్‌, మోహన్‌రావుపేట గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొని పట్టణానికి చెందిన మారుపాక వినోద్‌ (28) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం వినోద్‌ వ్యవసాయ బోర్లు మరమ్మతు చేస్తుంటాడు. సోమవారం సాయంత్రం కోరుట్ల నుంచి మోహన్‌రావుపేట వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోతల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వినోద్‌కు భార్య, ఏడాది కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి

మెట్‌పల్లి రూరల్‌: పంటల సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌లో కరీంనగర్‌లోని రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ ప్రదర్శన, పంటల్లో యాజమాన్య పద్ధతులపై సోమవారం రైతు సదస్సు నిర్వహించారు. ఆధునిక కేతిక విధానాలను రైతులు అందుకోవాలన్నారు. ఎరువులు మోతాదులో వాడాలని, పంట అవశేషాలను తగలబెట్టకూడదని, మెలకువలు పాటించి అధిక దిగుబడి పొందాలని పేర్కొన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్‌ హరికృష్ణ, శాస్త్రవేత్తలు మదన్‌మోహన్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, రాంప్రసాద్‌, ఉమారాణి, భారతీనారాయణ భట్‌, అరుణ్‌బాబు, డీఏవో భాస్కర్‌, ఏవో దీపిక, ఏఈవో అనిల్‌ పాల్గొన్నారు.

విద్యార్థుల్లో సాంకేతికత అలవర్చాలి

జగిత్యాల: విద్యార్థుల్లో సాంకేతికత అలవర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ లిటరసి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు క్షుణ్ణంగా తెలుసుకుని వారికి వివరించాలని డీఈవో రాము అన్నారు. భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు డిజిటల్‌ లిటరసిపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి సోమవారం హాజరయ్యారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌లో ప్రాథమిక అభ్యాసంతో నైపుణ్యం అలవర్చేలా చూడాలన్నారు. కో–ఆర్డినేటర్‌ రాజేశ్‌, ఈశా స్కూల్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ చైర్మన్‌ కంది కై లాసం పాల్గొన్నారు.

హుజూరాబాద్‌రూరల్‌: మండలంలోని వెంకట్రావ్‌పల్లెలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోతిరెడ్డిపేటకు చెందిన గీత కార్మికుడు చింత సమ్మయ్య (46) బైక్‌పై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సమ్మయ్య తలకు తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనదారుడు మెట్‌పల్లి గ్రానై ట్‌ క్వారీలో పనిచేసే వ్యక్తిగా భావిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులున్నారు.

నీటిలో మునిగి వ్యక్తి మృతి1
1/3

నీటిలో మునిగి వ్యక్తి మృతి

నీటిలో మునిగి వ్యక్తి మృతి2
2/3

నీటిలో మునిగి వ్యక్తి మృతి

నీటిలో మునిగి వ్యక్తి మృతి3
3/3

నీటిలో మునిగి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement