
ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
ధర్మపురి/మల్యాల:ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి, మల్యాలలోని కొండగట్టు ఆలయాల్లో శ్రీకృష్ణాష్ఠమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నృసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్ పాల్గొన్నారు. అంజన్న ఆలయ రాజగోపురం ఎదుట అర్చకులు, భక్తులు, వేద పాఠశాల విద్యార్థులు ఉట్టి కొట్టారు. శ్రీకృష్ణుడికి పంచామృతాభిషేకం, 56 రకాల మహా నైవేద్యం సమర్పించారు.