
నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు
హుజూరాబాద్: ‘నా పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదు..’ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు పెడుతున్నారన్నారు. మీడియాను మేనేజ్ చేసి ఓర్‌లాపింగ్ టెక్నిక్‌తో నెట్టుకొస్తున్నారన్నారు. రూ.9వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థుల చదువులు బలిపీఠంపై ఎక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో సమయానికి డైట్ చార్జీలు చెల్లించక వారు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా విద్యారంగానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. సంవత్సరానికి దాదాపు రూ.3వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఖర్చు అవుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తుందన్నారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లలో డైట్ చార్జీలు ఆరు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు రూ.5లక్షల కార్డు ఇస్తామన్నా హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, నాయకులు గౌతంరెడ్డి, బండి కళాధర్, వెంకట్‌రెడ్డి, సంపత్‌రావు, సురేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కరుణాకర్, సురేందర్‌రాజు, సుదర్శన్‌రెడ్డి, శ్రీరామ్ శ్యామ్, తిరుపతి, కరుణాకర్, రత్నాకర్, సుమన్ పాల్గొన్నారు.
రామగుండం: పెద్దపల్లి జంక్షన్ నుంచి తిరుచానూరు(తిరుపతి)కి ఈనెల 30వ తేదీ వరకు ఫెస్టివల్ స్పెషల్ రైలు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. నాందేడ్ – తిరుచానూరు (రైలు నంబరు 07039) మధ్య ప్రతీ మంగళవారం, తిరుచానూరు – నాందేడ్(07040) మధ్య ప్రతీ బుధవారం ప్రత్యేక రైలు నడుస్తుంది. ముద్కేడ్, బాసర, నిజామా బాద్, ఆర్మూర్, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధి ర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూ రు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ ఉంది.
మెట్‌పల్లి: తనకు బాకీ ఉన్న డబ్బులు ఇవ్వాలని అడిగిన యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. పట్టణానికి చె ందిన ఎనగందుల గణేశ్ కొంతకాలం క్రితం జగిత్యాలలోని మిర్యాల్‌కర్ రాజేశ్వర్ మటన్ దుకాణంలో పని చేశాడు. ఆ సమయంలో బకా యి ఉన్న రూ.5వేల గురించి ఆదివా రం అతడికి ఫోన్ చేసి అడిగాడు. దీనికి ఆగ్రహించిన రాజేశ్వర్.. దుర్భషలాడుతూ అంతు చూస్తానని బెది రించాడు. సాయంత్రం విష్ణు, నిఖిల్‌తో కలిసి మెట్‌పల్లిలోని గణేశ్ ఇంటికి వచ్చాడు. అతడు లేకపోవడంతో ఇంట్లో వాళ్లని తిట్టి వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో బస్ డిపో చౌరస్తాలో గణేశ్ తన మిత్రులతో ఉండగా.. అక్కడకు వచ్చి ముగ్గురూ అతనితో గొడవకు దిగారు. రాజేశ్వర్ తన వెంట తెచ్చుకున్న కత్తి తో గణేశ్ కడుపులో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన గణేశ్‌ను మొదట స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. అక్కడినుంచి నిజామాబాద్ తరలించారు. గణేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మాటలకు, చేతలకు పొంతన లేదు
యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్