
మల్లన్నా.. సౌలత్‌ల సంగతేమిటి?
● లక్షమంది భక్తులు.. ఐదే మరుగుదొడ్లు
● అడ్రస్ లేని అదనపు వసతి గదులు
● రాత్రివేళ భక్తులకు తప్పని తిప్పలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో భక్తులకు సౌకర్యాలు కరువయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా మల్లన్న జాతర ప్రారంభమై జూలై వరకూ కొనసాగుతుంది. పెద్దపట్నాలతో ఉత్సవాలు ముగుస్తాయి. వీటితోపాటు ప్రతీ ఆది, బుధవారాల్లో లక్షల మంది భక్తులు తరలివస్తారు. విశ్రాంతి కోసం సరిపడా గదులు లేవు. కేవలం ఐదు మరగుదొడ్లే అందుబాటులో ఉన్నాయి. శిథిలైన రేకులషెడ్ల కిందే సేదదీరుతున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు ఇటీవల ఓదెల మల్లన్న గుడిని సందర్శించారు. మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తూ భక్తులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు.

మల్లన్నా.. సౌలత్‌ల సంగతేమిటి?