
మాస్టర్‌ప్లాన్‌తో అభివృద్ధి
ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానం అభివృద్ధికి కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు, పా లకవర్గం ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లా న్ అమలు చేయాలని నిర్ణయించారు. పా లకవర్గం కూడా తీర్మా ణం చేసింది. నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నారు.
– సదయ్య, ఈవో, ఓదెల మల్లన్న ఆలయం
ఓదెల మల్లన్న దర్శనం కోసం వచ్చే మాలాంటి మహిల భక్తులకు సరిపడా మరగుదొడ్లు నిర్మించాలి. లక్ష మందికి ఐదు మరగుదొడ్లు ఉంటే ఎలా సరిపోతాయి. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలి.
– దిడ్డిగ లక్ష్మి, భక్తురాలు, జమ్మికుంట
మల్లన్నగుడిలో రాత్రిపూట నిద్రకోసం అదనపు గదులు నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న గదులు సరిపోవడంలేదు. ఆరుబయట పడుకొంటే దొమలతో ఇబ్బందిగా ఉంది. గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి
– వేముల సురేశ్‌కుమార్, భక్తుడు వరంగల్

మాస్టర్‌ప్లాన్‌తో అభివృద్ధి