
రాష్ట్రంలో అరాచక పాలన
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాలరూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలో దండ్ల శ్రీనివాస్‌పై జరిగిన దాడి ఘటనపై జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ను కలిసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాడి వెనుక ఉన్న నిందితులకు ఇప్పటికే నేర చరిత్ర ఉందని, వీరిని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాపాడుతున్నాడని పేర్కొన్నారు. నిందితులపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టామని, పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారని మాజీ మంత్రి తెలిపారు. అనంతరం జగిత్యాలలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, హరిచరణ్‌రావు, గోస్కుల జలేందర్, ఆవుల సత్యం, వెంకట మాధవరావు, రవీందర్, శేఖర్, అశోక్‌రావు, రవీందర్, కిషన్, చందు ఉన్నారు.