
మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలి
కథలాపూర్: రైతులు తమ వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. మండలకేంద్రంలో ట్రాన్స్‌కో అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటార్ల వద్ద ఇనుపడబ్బాలు కాకుండా ఫైబర్‌వి బిగించుకోవాలన్నారు. ఇనుప డబ్బాలతో విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదముందన్నారు. సిరికొండ శివారులో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ట్రాన్స్‌కో టెక్నికల్ డీఈ గంగారాం, మెట్‌పల్లి డీఈ మధుసూదన్, ఏడీఈ రఘుపతి, ఏఈలు దివాకర్‌రావు, భూమేశ్వర్, సబ్ ఇంజినీర్ నవీన్ పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాదాలు తగ్గించాలి
కోరుట్ల రూరల్: విద్యుత్ ప్రమాదాల నివారించి.. మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్‌ఈ అన్నారు. పట్టణంలో కోరుట్ల, మేడిపెల్లి, కథలా పూర్ మండలాల విద్యుత్ సిబ్బందితో బుధవారం సమీక్షించారు. ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం