
మహిళాశక్తి సోలార్ ప్లాంట్ల పరిశీలన
జగిత్యాలరూరల్/గొల్లపల్లి: మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇందిర మహిళాశక్తి కింద సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోందని ఐకేపీ నాన్ డీపీఎం నారాయణ అన్నా రు. జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి, గొల్లప ల్లి మండలం నందగిరిలో ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్ తయారీ యూనిట్‌ను ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. పెగడపల్లి మండలం నందగిరిలో రెవెన్యూ శాఖ అప్పగించిన స్థలంలో రెడ్‌కో ఆధ్వర్యంలో యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఒక్కో ప్లాంట్ విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందన్నారు. జిల్లా ఏపీఎం కోల శ్రీనివాస్‌చక్రవర్తి, ఏపీఎం ఓదెల గంగాధర్, సీసీ పొడేటి గంగారాం, అభ్యుదయ, చైతన్య గ్రామైక్య సంఘాల అధ్యక్షులు బక్కశెట్టి నర్సమ్మ, వడ్లూరి లక్ష్మీ, వీవోఏలు సురేశ్, హారిక, సమైక్య స భ్యులు మ్యాకల రాధ, బూర్గుల సునీత పాల్గొన్నారు.