
తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు
వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జైలు శిక్ష, జరిమానాలు తప్పవని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారికి పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ర్యాష్‌గా లారీ నడిపిన వ్యక్తికి 20 రోజుల జైలు, రూ.10వేల జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్‌కుమార్ తీర్పు వెల్లడించారు. అనంతరం డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో దొరికిన వారితో ట్రాఫిక్ ఆర్‌ఎస్సై రాజు ఆధ్వర్యంలో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు.
ర్యాష్ డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్‌కు 20 రోజుల జైలు
24 మందికి జరిమానా