
అమ్మ, అక్క పార్థివదేహాలు
నేత్ర, అవయవదానంతోపాటు దేహదానంపై కాళోజీ నారాయణరావు మరణించినప్పుడు అవగాహన వచ్చింది. దీంతో 2003లో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి నా శరీరాన్ని దానం చేస్తానని రాసి ఇచ్చాను. మా అమ్మ, అక్క కూడా ముందుకు వచ్చారు. అమ్మ 2014లో మరణించగా కరీంనగర్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీకి, అక్క 2023లో మరణిస్తే వరంగల్ మెడికల్ కాలేజీకి వారిద్దరి దేహాలను దానం చేశాం. నా నిర్ణయాన్ని గౌరవించి నా భార్య నిర్మల కూడా దేహదానానికి అంగీకారాన్ని తెలిపింది.
– సురేశ్‌బాబు, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి, గోదావరిఖని
అవగాహన పెరిగింది
నేత్ర, అవయ, దేహదానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముందుంది. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సదాశయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి స్ఫూర్తి నా సోదరుడు అశోక్‌కుమార్. 2006లో హార్ట్ ఎటాక్‌తో మరణించగా, ఆయన ఆశయం మేరకు నేత్రదానంతోపాటు, పార్థీవదేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశాం. మాది సంప్రదాయ వైష్ణవ కుటుంబం. మా కుటుంబం సానుకూలంగా ఉన్నా బంధువర్గం నిరాకరించి గొడవకు దిగారు. తమ్ముడి ఆశయం నెరవేర్చడానికి అందరూ అంగీకరించేలా నచ్చజెప్పి చేశాం.
– టి.శ్రవణ్‌కుమార్, జాతీయ అధ్యక్షుడు, సదాశయ ఫౌండేషన్

అమ్మ, అక్క పార్థివదేహాలు