
కాళోజీ స్ఫూర్తితో..
కోల్‌సిటీ(రామగుండం): స్వాతంత్య్ర సమరయోధులు, గొప్ప కవి కాళోజీ నారాయణరావు తన మరణానంతరం శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు. వారే నాకు స్ఫూర్తి. నాతోపాటు నా భార్య కూడా మా మరణాంతరం మెడికల్ కాలేజీలకు మా శరీరాలను దానం చేస్తామని ప్రకటించాం. కాల్చడమో, పూడ్చడమో చేయకుండా వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం పార్థివ దేహాలను దానం చేయడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి. గత నెల 15న మా ఇద్దరి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇంట్లో పెద్ద సభ ఏర్పాటు చేసి, అందరికీ నేత్ర, అవయవ, దేహదానంపై అవగాహన కల్పించాం. – ఎల్.రాజయ్య,
రిటైర్డ్ ఎంఈవో, గోదావరిఖని
అమ్మ కళ్లను దానం చేశాం
ధర్మపురి: మాది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నాగారం. అమ్మ చెలుముల చిన్నలక్ష్మి గుండె సమస్యతో బాధపడుతూ 2016లో మృతి చెందింది. ఆమె కళ్లను సజీవంగా ఉంచడం కోసం మృతిచెందిన కొద్ది నిమిషాల్లోనే లయన్స్‌క్లబ్ వారికి దానం చేసినం. దేశంలో కళ్లు లేనివారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఉపయోగపడతాయి. అన్ని దానాల కంటే అవయవ దానం గొప్పది. – చిలుముల లక్ష్మణ్

కాళోజీ స్ఫూర్తితో..