
పుష్పాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వా మివారికి క్షీరాభిషేకం చేసి పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకుడు శ్రీనివాసాచార్యులు లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు త రలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు.
సమయపాలన పాటించాలి
జగిత్యాల: అధికారులు సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ ఫైల్స్ వెంటనే పరిష్కరించాలన్నారు. ఏవో హకీమ్ తదితరులు ఉన్నారు.
నాణ్యమైన విద్య నందించాలి
ధర్మపురి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. శుక్రవారం ధర్మపురిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వర్షంతో గదుల్లోకి నీరు చేరి కొంత ఇబ్బంది అవుతుందని విద్యార్థులు తెలుపగా సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన మాక్ పోలింగ్‌లో పాల్గొన్ని ఓటు వేశారు. ఇన్‌చార్జి తహసీల్దార్ సుమన్, ఎంపీడీవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులున్నారు.
కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలి
జగిత్యాల: జనాభా పెరుగుదలతో ఇబ్బందులు తలెత్తుతాయని, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లకార్డ్స్‌తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా పెరుగుతుంది కానీ ఆర్థిక వనరులు తరిగిపోతున్నాయని, దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఒకరు లేదా ఇద్దరిని కని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్నారు. వైద్యులు సైతం ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, డాక్టర్ సంతోష్, స్వాతి, చైతన్యరాణి తదితరులు పాల్గొన్నారు.
చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
జగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. ఈనెల 15న నిర్వహించే చలో హైదరాబాద్ బీసీల మహాధర్నా పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. బీసీల రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, వారి ఓట్ల ద్వారా గద్దెనెక్కి కాలయాపన చేయాలని, మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ చేయించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు, 9వ షెడ్యూల్డ్‌లో చేర్చడం ఒక్కటే పరిష్కారం అన్నారు. 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీలకతీతంగా ఈనెల 15న ఇందిరపార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు హాజరుకావాలని కోరారు. నాయకులు కుమార్, దేవి రవీందర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

పుష్పాలంకరణ

పుష్పాలంకరణ

పుష్పాలంకరణ