
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. ఇందిరాభవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈసందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ ఆలోచన విధానం, డెడికేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు బలహీనవర్గాలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించడం జరిగిందన్నారు. కానీ, బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ప్రకటించలేదన్నారు. దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవడానికి అంబేడ్కర్ రాజ్యాంగమే కారణమన్నారు. నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ఎలిగేటి నర్సయ్య, బొడ్డు లక్ష్మణ్, చందా రాధాకిషన్, ముంజాల రఘువీర్ ఉన్నారు.