
రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు
జగిత్యాల: జగిత్యాల బల్దియాలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బల్దియా కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత ఆధ్వర్యంలో గురువా రం అధికారులతో సమీక్షించారు. పట్టణంలో విలీన ప్రాంతాలకు రూ.20 కోట్లు, తాగునీటికి రూ.32 కోట్లు, అమృత్ స్కీం కింద రూ.38 కోట్లు మంజూరయ్యాయని, వాటితో పనులు ఎలా చేపట్టాలో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం, ఎల్‌ఆర్‌ఎస్, స్టాంప్ డ్యూటీ, ఇతర పనులపై ఆరా తీశారు. అర్బన్ హౌసింగ్ కాలనీ, డబుల్‌బెడ్‌రూం ఇందిరమ్మ కాలనీలో చేపట్టాల్సిన వసతులకు అంచనాలు రూపొందించాలన్నారు. డ్రైనేజీ, పైప్‌లైన్ల విషయలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, శానిటేషన్ అధికారులు పకడ్బందీగా పనిచేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, ఏఈలు చరణ్, అరుణ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
పల్లెదవాఖానాలతో మెరుగైన వైద్యం
జగిత్యాలరూరల్: గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య దవాఖానాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య దవాఖానాల నిర్మాణాలు, రూ.25 లక్షల ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించే సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు.