
కొత్త లైన్లు ఏర్పాటు సంతోషం
సారంగాపూర్ అడవిలో చెట్లు పడి కరెంట్ నిలిచిపోయేది. అటు పొలాలకు కరెంట్ లేక.. పంటలకు ఇబ్బంది కలిగేది. ఇళ్లలో దోమల బెడదతో తట్టుకోలేకపోయేవాళ్లం. రాత్రిపూట బయట అడుగుపెట్టడం కష్టంగా ఉండేది. అధికారులు కొత్తగా చేపట్టిన నేరెళ్ల లైన్‌తో సమస్య లేకుండా తీరుతుంది.
– పురుమల్ల నగేష్‌రెడ్డి, సారంగాపూర్
చాలా ఏళ్ల సమస్య తీరింది
మేం 40 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు విద్యుత్ అధికారులు ఇప్పుడు పరిష్కరిస్తున్నారు. కొత్త లైన్లతో ఒక లైన్ నుంచి కరెంట్ రాకున్నా.. మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు పొలాలకు నీరు పెట్టేందుకు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆ సమస్య తీరుతుండడం ఆనందంగా ఉంది.
– న్యారబోయిన రాజేశం, సారంగాపూర్
కొత్త లైన్ ప్రారంభిస్తాం
నేరెళ్ల నుంచి ఏర్పాటు చేస్తున్న 33 కేవీ విద్యుత్ లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఉన్నతాధికారుల సహకారంతో మరో 15 రోజుల్లో ఈ లైన్ నుంచి విద్యుత్తు సరఫరా ప్రారంభిస్తాం. కొత్త లైన్ల ఏర్పాటుతో సారంగాపూర్, బట్టపల్లి, నాయికపుగూడెం, పోతారం గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉండదు.
– ప్రవీణ్, ఏఈ, సారంగాపూర్

కొత్త లైన్లు ఏర్పాటు సంతోషం

కొత్త లైన్లు ఏర్పాటు సంతోషం