
ఇటిక్యాలలో జిల్లా అదనపు మొదటి జడ్జి పూజలు
రాయికల్: గురుపౌర్ణమి సందర్భంగా మండలంలోని ఇటిక్యాలలోగల సాయిబాబా ఆలయ ంలో గురువారం జిల్లా అదనపు మొదటి జడ్జి నారాయణ పూజలు చేశారు. సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ హిమవంతరావు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణం
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని గురువా రం శ్రీలలిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 116మంది మహిళలు హనుమాన్ చాలీసా, హనుమాన్ పారాయణం నిర్వహించారు. లింగాష్టకం, విష్ణుసహస్రనామస్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రం లలిత సహస్రనామ పారాయణం చేశా రు. లలిత సేవా ట్రస్టు ఫౌండర్ విశ్వనాథుల రమే శ్, డైరెక్టర్ కొట్టె ప్రేమలత, ఉమాలక్ష్మీ, వనజ, పులి రవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు సంరక్షించాలి
జగిత్యాలరూరల్: మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని ఎకాలజికల్ సొల్యుషన్స్ సభ్యులు శ్రీనివాస్, ప్రవీణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో హరితహారం కింద నాటిన మొక్కలను ఐవోఆర్‌ఏ ఎకనాలజికల్ సొల్యుషన్స్ న్యూఢిల్లీ వారు పరిశీలించారు. పైలెట్ ప్రాజక్ట్ కింద ఎంపిక చేయబడిన గ్రామాల్లో మొక్కల సంరక్షణకు ప్రత్యేక నిధులు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ నరేశ్, ఏపీవో గంగలక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి కిరీటి, టీఏలు సువర్ణ, వెంకటేశ్, శైలజ పాల్గొన్నారు.
హోదా మరిచి.. జనంతో కలిసి..
వెల్గటూర్:మంత్రి అయినా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మండలకేంద్రానికి గురువారం వచ్చిన ఆయన ఓ హోటల్ వద్ద ఆగారు. అక్కడ అందరితో కలిసి టీ తాగా రు. ప్రజల సమస్యలు అడిగి తెలుసున్నారు. సామాన్యుడిలా జనంతో కలిసి పోయిన మంత్రిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
విద్యుత్ అధికారుల పొలంబాట
మల్లాపూర్: విద్యుత్ అధికారులు గురువారం పొలంబాట పట్టారు. రైతుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని గుండంపల్లిలో ఎన్పీడీసీఎల్ డీఈ మధుసూద న్ పర్యటించారు. ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ పోయినపుడు సిబ్బందికి సమాచారం ఇవ్వాలని హితవుపలికారు. తీగలు వేలాడకుండా మధ్యమధ్య స్తంభాలు వేస్తామన్నారు. కొత్త కనెక్షన్లను సత్వరం జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏడీఈ మనోహర్, రాఘవపేట ఏఈ సంతోష్, రైతులు పాల్గొన్నారు.
మేడిపల్లిలో..
మేడిపల్లి: డీఈ గంగారాం ఆధ్వర్యంలో సిబ్బంది భీమారం మండలకేంద్రంలో పొలంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలపై రైతులకు అవగాహన కల్పించారు. మన్నెగూడెం ఏఈ అశోక్, సబ్ ఇంజినీర్ హరిప్రసాద్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇటిక్యాలలో జిల్లా అదనపు మొదటి జడ్జి పూజలు

ఇటిక్యాలలో జిల్లా అదనపు మొదటి జడ్జి పూజలు

ఇటిక్యాలలో జిల్లా అదనపు మొదటి జడ్జి పూజలు